కేసీఆర్ ను గద్దె దింపడానికి కాంగ్రెస్,టీడీపీ లు అనైతిక పొత్తును పెట్టుకున్నాయని తెరాస నేత KTR వ్యాఖ్యానించారు.ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగిన సభలో మాట్లాడిన ఆయన,కాంగ్రెస్ కు వ్యతిరేఖంగా స్వర్గీయ ఎన్టీఆర్ విలువలతో టీడీపీ ని స్థాపించారని,ఇప్పుడు చంద్రబాబు ఆ విలువకు తిలోదకాలు ఇచ్చారన్నారు.అటు తెలంగాణకు రావాల్సిన నీళ్లపై కొర్రీలు పెట్టె చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మద్దని KTR విజ్ఞప్తి చేసారు.
