దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా వ్యాక్సిన్ ,19 మంది మృతి

న్యూఢిల్లీ : క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ దేశ వ్యాప్తంగా ముందుకు పోతుంది . అయితే ఇప్ప‌టి వ‌ర‌కు 44 ల‌క్ష‌ల మంది క‌రోనా టీకా తీసుకున్నారు. ఇందులో 8,563 మందికి పైగా తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన‌ట్లు తేలింది. క‌రోనా టీకా తీసుకున్న వారిలో 37 ల‌క్ష‌ల మందిని సంప్ర‌దించ‌గా, ఆ టీకా ప్ర‌భావం గురించి 5 ల‌క్ష‌ల మంది మాత్ర‌మే స్పందించారు. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న త‌ర్వాత 19 మంది మ‌ర‌ణించార‌ని తెలిపారు. కానీ వీరి మృతికి క‌రోనా టీకాతో ఎలాంటి సంబంధం లేద‌ని, ఇత‌ర జ‌బ్బుల కార‌ణంగానే చ‌నిపోయార‌ని పేర్కొన్నారు. మొద‌టి ద‌శ‌లో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు 97 ల‌క్ష‌ల మంది హెల్త్ వ‌ర్క‌ర్స్ క‌రోనా టీకా తీసుకున్నారు. మొద‌టి ద‌శ‌లో క‌రోనా టీకా తీసుకున్న ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల‌కు ఈ నెల 13వ తేదీ నుంచి రెండో డోసు ఇవ్వ‌నున్నారు.

error: