నందమూరి హరికృష్ణ దుర్మరణం

హరికృష్ణ ఇవాళ తెల్లవారుజామున సెల్ఫ్‌ డ్రైవ్ చేసుకుంటూ హైదరాబాద్ నుంచి నెల్లూరుకు బయల్దేరారు. నల్లగొండ జిల్లాలోని అన్నెపర్తి 12వ బెటాలియన్ దగ్గర కారు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో ప్రమాద తీవ్రతకు కారులోంచి హరికృష్ణ ఎగిరిపడ్డారు. దీంతో ఆయన తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గుర్తించి నార్కట్ పల్లిలోని కామినేని ఆస్పత్రికి ఆయన్ని తరలించారు. అప్పటికే పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

నందమూరి హరికృష్ణ గతంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. బాలనటుడిగా సినీరంగ ప్రవేశం చేసిన హరికృష్ణ… హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ పలు సినిమాల్లో నటించారు. శ్రీరాములయ్య, టైగర్ హరిశ్చంద్రప్రసాద్, సీతయ్య, సీతారామరాజు, శ్రావణమాసంతో పాటు పలు సినిమాల్లో నటించారు. సీతయ్య సినిమా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. ప్రముఖ హీరోలు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఈయన కుమారులే.

error: