ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆదివారం మూడు జిల్లాల్లో ఆరు సభల్లో పాల్గొననున్నారు.తెరాస ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు.శనివారం ప్రచారం నుంచి విరామం తీసుకున్న సీఎం KCR ఈ రోజు వికారాబాద్,మహబూబ్ నగర్,రంగారెడ్డి జిల్లాల్లో పర్యటించి తాండూరు,పరిగి,నారాయపేట,దేవరకద్ర,షాద్ నగర్,ఇబ్రహీం పట్నం నియోజకవర్గాల్లో ఏర్పాటుచేసే బహిరంగ సభల్లో ప్రసంగించారు.మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఈ సభలు కొనసాగనున్నాయి.ఈ సభల నేపథ్యంలో పోలీస్ లు గట్టి భద్రత ఏర్పాట్లు చేసారు.
