పంచాయతీ పోరుపై టీజేఎస్ గురి

అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి త్వరగా కోలుకునేందుకు తెలంగాణ జన సమితి ప్రయత్నిస్తోంది.కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లినా పరాభవమే ఎదురవడంతో జవసత్వాలు కూడగట్టుకుని పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచేందుకు యోచిస్తుంది.ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగాలని టీజేఎస్ భావిస్తుంది.పంచాయతీ ఎన్నికల్లో స్థానిక అంశాలు,అభ్యర్థులే ఫలితాలను నిర్ణయించే అవాకాశం ఉండడంతో క్షేత్రస్థాయిలో మంచి పేరున్న వారిని పోటీలో నిలపాలనుకుంటుంది.పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్,కూటమితో కలిసి వెళ్లే ఆలోచన తమకు లేదని టీజేఎస్ నేతలు చెబుతున్నారు.ఖచ్చితంగా తమ సొంత బలంతోనే పంచాయతీ ఎన్నికల్లో పోరాడుతామని,గ్రామాల్లో పార్టీ బలోపేతం అయ్యేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని వారంటున్నారు.అయితే,దీనిపై పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

error: