ప్రతి టికెట్ మీద ఒక రూపాయి రైతు కి ఇస్తాము

హీరో విశాల్ ది పేరు కు తగ్గట్లే విశాలమైన హృదయం.VFF సంస్థ తన సొంత స్వీయ నిర్మాణం లో నిర్మించే ఏ చిత్రనికైనా వచ్చిన లాభాల్లో ప్రతి టికెట్ మీద ఒక రూపాయి రైతులకి ఇస్తారు అని చాల తక్కువ మందికి తెలుసు.తన సినీ కెరియర్ లో 25 వ చిత్రం పందెం కోడి-2 ఆడియో ఆవిష్కరణలో భాగంగా,తన 24 వ చిత్రం అభిమన్యుడు చిత్రం కి గాను వచ్చిన లాభాల్లో తమిళనాడు,తెలంగాణ రాష్ట్రాలలో ఆర్థిక అప్పుల వలన చనిపోయిన రైతు కుటుంబాలకు తనకు తోచిన సహాయం అందించారు.
విశాల్ గారి మాటలలో,
రైతు పొలంలో కాలు పెడితేనే మన చెయ్యి అన్నం లో పెట్టగలం.అలాంటి మన ఆకలి తీర్చే రైతు ఆర్థిక అప్పులు ప్రభుత్వం తలుచుకుంటే చిటికలో మాఫీ చేయొచ్చని,కానీ ప్రభుత్వాలు రైతుల బాధను తాయిలాలతో మభ్యపెట్టి ఓటు బ్యాంకుగా మార్చికుని వారిని మోసం చేస్తున్నారని గట్టిగానే ప్రభుత్వాలపై విరుచుకు పడ్డారు.ఈ చిత్రాన్ని మీరందరు చూడడం వలన పరోక్షంగా ఒక రూపాయి రైతులకు అందే అవకాశం ఉందని అన్నారు.

error: