ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బౌద్ధ క్షేత్రాలలో ఫణిగిరి బౌద్ధ క్షేత్రం ఒకటి-బర్మా భిక్షకులు

తుంగతుర్తి నియోజక వర్గంలోని నాగారం మండల పరిధిలోని ఫణిగిరి గ్రామంలో సోమవారం బౌద్ధక్షేత్రాన్ని,మ్యూజియం సందర్శించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మహాయాన బుద్దిస్ట్ అధ్యయన కేంద్రాల్లో బౌద్ధ పరిశోధన విద్యార్థులుగా అభ్యసిస్తూ పరిశోధనలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని నేలకొండపల్లి బుద్ధవనం దూళికట్ట బౌద్ధ క్షేత్రాలతో పాటు సోమవారం ఫణిగిరి బౌద్ధక్షేత్రాన్ని సందర్శించినట్లు తెలిపారు.ఇక్కడి బౌద్ధ క్షేత్రంలో అత్యంత విలువైన శీలా సంపద ఉన్నాడని అన్నారు.కొండపైన ఉన్న చైత్యాలు,స్తూపాలు,విహార గదులను పరిశీలించారు.అలాగే ఫణిగిరి గ్రామంలో ఉన్న తాత్కాలిక మ్యూజియం లోని బుద్ధా జాతక కథలు,బుద్ధుని విగ్రహాలను,స్తూపాలను పరిశీలించారు.ఫణిగిరి బౌద్ధ క్షేత్రాన్ని అభివృద్ధి చేసి మౌలిక వసతులు కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో బౌద్ధ భిక్షకులు,అసిన్ జయసుర,అసిన్ సుమంగళ,అసిన్ సుందర,సిరిండా,వసిష్ఠ,క్షేత్ర సిబ్బంది గట్టు వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

error: