సికింద్రాబాద్ మారేడ్పల్లి వాల్మికీనగర్లో తీవ్ర విషాదం నెలకొంది.వాట్సాప్ లో యువతితో చాటింగ్ ఏంటని భర్త శివకుమార్ ని భార్య నిలదీసింది.మనస్తాపం చెందిన శివకుమార్ రెండ్రోజుల క్రితం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.శివకుమార్ మృతితో తనను బంధువులు మందలించారంటూ ఆమె కూడా యాసిడ్ తాగింది.చికిత్స పొందుతూ ఆదివారం ప్రాణాలు విడిచింది.