బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది.దీనికి అనుబంధంగా 4.5 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో వచ్చే 48 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఫలితంగా గంటకు 30నుంచి 40 కిలోమీటర్ల వేగంగా ఈదురు గాలులు వ్యాపించడంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Tags full rains INDIA rainy season safe stay home stay safe telangana three day