బఠాణీ టమాటో కర్రీ

కావాల్సిన పదార్థాలు  :

పచ్చిబఠాణీలు    – 100 గ్రా
నూనె                – గరిటెడు
ఉల్లిపాయలు      – 4
పచ్చిమిర్చి        – 10
వెల్లుల్లి              – 4
టమోటాలు       – 1/4 కిలో
పసుపు            – చిటికెడు
కారం               – తగినంత
ఉప్పు              – తగినంత
కొత్తిమీర           – 2 చిన్నకట్టలు

తయారు చేసే విధానం :
పచ్చి బఠాణీలను రాత్రి నానబెట్టి,  కర్రీ వండే ముందు కొంచెం ఉడకపెట్టుకోవాలి
టమోటాలు ముక్కలుగా కోసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి చిన్నగా తరగాలి.
గిన్నెలో  నూనె వేసి కాగాక వెల్లుల్లి వేసి తాలింపు పెట్టి ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఎర్రగా వేయించాలి .
తరువాత టమోటా ముక్కలు బఠాణీలు వేసి పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి.
కలతో త్రిప్పి మూత పెట్టాలి. టమోటా ఉడికాక కొత్తిమీర తరిగివేసి రెండు నిముషాలు ఉంచి దించేయాలి.
అంతే టమాటో బఠాణీ కర్రీ టేస్ట్ చేసేందుకు రెడీ.

error: