బీజేపీకి షాక్ ట్రీట్ మెంట్

తెలంగాణ ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత రాష్ట్ర బీజేపీ శాఖ ఇటీవలే ఓటమిపై పున సమీక్ష చేసుకుంది. అవమానకరమైన ఈ ఓటమికి ఏ ఒక్కరిని బాధ్యడిని చేయరాదని.. పార్టీ పూర్తి స్థాయిలో వెనుకబడడానికి కారణాలు అన్వేషించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఎవరూ కూడా ఈ ఓటమికి బాధ్యతను భుజాన వేసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. మొదట కేంద్రం  వైఖరి వల్లేనని అనుకున్నా తర్వాత నేతల పొరపాట్లు.. క్షేత్రస్థాయిలో బలం సహా ఓటమికి చాలా కారణాలను నేతలు అన్వయించుకున్నారు.తెలంగాణ ఎన్నికల్లో ఓటమిపై రాష్ట్ర బీజేపీ వ్యవహారాలు చూస్తున్న జేపీ నడ్డా నివేదిక రూపొందించారట.. నాయకులతో సమీక్ష అనంతరం ‘కేంద్రం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్ర బీజేపీకి అవసరమైన సాయం అందించామని.. జాతీయ నేతలు – ముఖ్యమంత్రులు కూడా వచ్చి ప్రచారం చేశారని.. కానీ రాష్ట్ర బీజేపీ నేతల చెత్త పనితీరు వల్లే తెలంగాణలో ఓడిపోయామని’ నడ్డా నివేదిక రూపొందించారట.. తెలంగాణలో ప్రస్తుత నాయకత్వం – సీనియర్లను మార్చాల్సిన అవసరం ఉందంటూ అమిత్ షాకు నడ్డా నివేదిక సిద్దం చేసి అందించబోతున్నాడని సమాచారం.

error: