భారత్ పాక్ తో తడపడాల్సి వస్తే ??

ముంబయి: రానున్న ఐసీసీ ప్రపంచ కప్‌లో భారత్‌ పాక్‌తో ఆడాల్సి వస్తే అన్న విషయంపై బీసీసీఐ కొంత స్పష్టత ఇచ్చింది. ప్రపంచ కప్‌ నాటికి భారత ప్రభుత్వం పాక్‌తో ఆడకూడదని నిర్ణయిస్తే తాము దానిని పాటిస్తామని తెలిపింది. ఆ సమయంలో పాక్‌.. మ్యాచ్‌ ఆడకుండానే పాయింట్లు పొందుతుందని పేర్కొంది. ఒక వేళ ఫైనల్‌లో పాక్‌తో తలపడాల్సి వస్తే వారు మ్యాచ్‌ ఆడకుండానే ప్రపంచ కప్‌ గెలుస్తారని పేర్కొంది. ఈ విషయంలో తాము ఇప్పటి దాకా ఐసీసీని సంప్రదించలేదని వివరణ ఇచ్చింది. ఈ విషయంలో ఐసీసీ చేసేదేమీ లేదని పేర్కొంది. ఈ విషయంపై స్పష్టత రావడానికి మరికొంత సమయం పట్టవచ్చని, ప్రపంచ కప్‌కు కొద్ది రోజుల ముందు ఇది తేలుతుందని అభిప్రాయపడింది. పుల్వామా ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో పాక్‌పై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ విధంగా స్పందించింది.

error: