ముంబయి: నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు మందకొడిగా ట్రేడవుతున్నాయి. ఉదయం 10.08 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 26 పాయింట్ల నష్టంతో 35,729 వద్ద, నిఫ్టీ 5 పాయింట్ల లాభంతో 10,741 వద్ద ట్రేడవుతోంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ షేర్లు 1శాతం లాభాలతో ట్రేడవుతున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన అవసరాల నిమిత్తం రూ.48,239 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం బుధవారం అంగీకారం తెలపడంతో ఆ షేర్లు దూకుడుగా ఉన్నాయి. వీటిల్లో అత్యధిక మొత్తం అలహాబాద్ బ్యాంక్ , కార్పొరేషన్ బ్యాంక్‌లకు కేటాయించనున్నారు. ఈ మొత్తంతో ఆ బ్యాంకులు ఆర్బీఐ పీసీఏ ఆంక్షల నుంచి బయటపడనున్నాయి. నేటి ట్రేడింగ్‌లో కార్పోరేషన్ బ్యాంక్ షేర్లు 15.48శాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. రూపాయి నేడు 4పైసలు బలపడి 71.07 వద్ద ట్రేడవుతోంది.