మరో వింత వ్యాధి ,ఆందోళనలో ప్రజలు

వికారాబాద్​జిల్లాలో అనుమానాస్పద స్థితిలో ఒకరు మృతిచెందగా 15‌0 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. వికారాబాద్​మండలం ఎర్రవల్లి, కొత్తగడి, చింతన్​బోడ, నారాయణపూర్​, పెండ్లిమడుగు, పులుమద్ది, నవాబుపేట మండలం మమదాన్​పల్లి, ఎక్​మామిడి, వట్టిమీనేపల్లి, చిట్టిగిద్ద, ఆర్కతల పంచాయతీల పరిధిలో 150 మంది వరకు వింత రోగ లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. ప్రధానంగా గ్రామస్తుల్లో మూడు రోజులుగా మూర్ఛ రోగ లక్షణాలు కనిపిస్తున్నాయి. కళ్లు తిరిగి పడిపోవడం, నోటి నుంచి నురగ రావడం, పళ్లు కొరుక్కోవడం, కాళ్లు, చేతులు కొట్టుకోవడం వంటి లక్షణాలతో బాధ పడుతున్నారు. పెండ్లిమడుగు గ్రామానికి చెందిన కిష్టారెడ్డి(52) ఇలాంటి లక్షణాలతో శనివారం మృతిచెందారు. ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాలె యాదయ్య మంత్రి సబితారెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో జిల్లా కలెక్టర్​ పౌసుమి బసును అలెర్ట్​ చేశారు. వికారాబాద్​ ప్రభుత్వ ఆసుపత్రితో పాటు మహావీర్, సాయి డెంటల్​ కాలేజ్, ప్రభుత్వ దవాఖానాల్లో తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్​ ఆదేశించారు. మంత్రి సబితారెడ్డి వికారాబాద్​ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు.

error: