మహా కూటమి గెలిచేది లేదు,వారికి ప్రతిపక్ష హోదా కూడా రాదు

కొడంగల్ నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నేతలు తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ లో చేరారు.ఈ సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారు.ఆయన మాట్లాడుతూ,
కొడంగల్ లో మీ ఉత్సాహం చూస్తుంటే ముమ్మాటికీ ఇక్కడ ఎగిరేది గులాబీ జెండాయే అన్నారు.
కొడంగల్ కు తాగు ,సాగు నీరు trs తోనే సాధ్యం. నలబై రోజులు మీరు పార్టీ కోసం కష్టపడండి ..అరవై నెలలు మీ కోసం కష్టపడతాం అన్నారు. టిడిపి ఆంధ్రా పార్టీ అని పోలి మేరల దాకా తరిమిస్తే మళ్ళీ కాంగ్రెస్ తెలంగాణ లోకి పొత్తుతో తీసుకొస్తోంది  కాంగ్రెస్ నేతలు చంద్రబాబు పల్లకి మోస్తున్నారు అన్నారు.
2009 ఎన్నికలప్పుడు వై ఎస్ నంద్యాల లో చేసిన తెలంగాణ వ్యతిరేక ప్రకటన పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు నోరు మెదప లేదు అని మండిపడ్డారు. సాగునీటి శాఖ తీసుకుని తెలంగాణను ఎండబెట్టాలని ,హోం శాఖ తీసుకుని ఓటు కు నోటు కేసు నుంచి బయట పడాలని టీడీపీ కుట్ర పన్నింది అని అన్నారు.
మహా కూటమి గెలిచేది లేదు …వారికి ప్రతిపక్ష హోదా కూడా రాదు అని వ్యాఖ్యానించారు.

error: