రాష్ట్రంలో మార్చి 2019 లో నిర్వహించనున్న పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు గడువు తేదీ ముగిసిందని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ బీ.సుధాకర్ తెలిపారు.ఆన్లైన్ ద్వారా విద్యార్థుల దరఖాస్తులు ssc బోర్డు కు పంపడానికి ఈ నెల 15 వరకు DEO లకు గడువు విధించామని చెప్పారు. గత ఏడాది 5.36 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తులు చేసుకుంటే,ఈ సారి ఆ సంఖ్య 5.4 లక్షలకు పెరిగిందని చెప్పారు.ఆలస్య రుసుముతో డిసెంబర్ వరకు పరీక్ష ఫీజు చెల్లించడానికి గడువు ఉందని,ఆ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.