రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్

తెరాస అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణస్వీకారం చేసారు.తెలుగు రాష్ట్రాల గవర్నర్ ESL నరసింహన్ గురువారం మధ్యాహ్నం 1.25 గంటలకు కేసీఆర్ తో ప్రమాణం చేయించారు.కేసీఆర్ తో పాటు మహమ్మద్ అలీ ఒక్కరే మంత్రిగా ప్రమాణం చేసారు.ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం కేసీఆర్ ముందుకు వంగి వినమ్రంగా వేదిక కింద ఉన్న అందరికి నమస్కారం చేసారు.అనంతరం కేసీఆర్ కు గవర్నర్ నరసింహన్ పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు.రాజ్ భవన్ లో సాదాసీదాగా ఈ కార్యక్రమం జరిగింది.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి SK.జోషి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ముఖ్యమంత్రి గా కేసీఆర్,మంత్రిగా మహమ్మద్ అలీల నియామకాన్ని నోటిఫై చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి SK.జోషి ఉత్తర్వులు జారీ చేసారు.

error: