పంచాయతీ కార్యదర్శుల పరీక్షను వాయిదా వెయ్యాలని కొంతమంది కోరినప్పటికీ అన్ని విషయాలను పరిగణలోనికి తీసుకుని రేపే నిర్వహించనున్నట్లు తెలంగాణ సీఎస్ sk జోషి స్పష్టం చేసారు.పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై సోమవారం అధికారులతో సమీక్షించిన ఆయన,ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.బుధవారం ఉ.10-12 గంటల వరకు మొదటి పేపర్,మ.3-5 గంటల వరకు రెండో పేపర్ పరీక్ష నిర్వహిస్తామన్నారు.