రేపే తెలంగాణ అసెంబ్లీ రద్దు

డిసెంబర్‌లోగా కచ్చితంగా ఎన్నికలు జరిగేందుకు వీలుగా సాంకేతిక ఇబ్బందులేవీ లేకుండా ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులకు సూచించారు. కేబినెట్‌ భేటీకి అవసరమైన అన్ని అంశాలను సాధారణ పరిపాలనశాఖ పూర్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఎస్‌. కె. జోషి, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, అసెంబ్లీ కార్యదర్శి వి. నర్సింహాచార్యులు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అయ్యారు.

గురువారం ఉదయానికి హైదరాబాద్‌లో ఉండాలంటూ మంత్రులకు ఇప్పటికే సమాచారం పంపింది. కేబినెట్‌ భేటీలో అసెంబ్లీ రద్దు అంశాన్ని చివరి నిమిషంలో ఎజెండాలో చేరుస్తారని, ఇప్పటికిప్పుడు ఎజెండాలో ఈ అంశం లేదని ఓ సీనియర్‌ మంత్రి చెప్పారు. అసెంబ్లీ రద్దు నిర్ణయం, ఆ తర్వాత అనుసరించాల్సిన విధానాలపై వారు ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది.

error: