తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా రూపొందాక రవాణా సదుపాయాలు వేగంగా పట్టాలెక్కుతున్నాయనుకున్నారు.ముఖ్యంగా రైల్వే ప్రాజెక్టులకి అప్పటివరకు ఉన్న అవాంతారాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని భావించారు.తొలి దశలో కీలక ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం వేగంగా స్పందించినా,క్రమంగా నెమ్మదించాయి.కొంతకాలంగా వివిధ సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యత నిచ్చిన తెలంగాణ ప్రభుత్వం కొన్ని డిపార్టుమెంట్లకు నిధులు విడుదల చేయలేదు.అందులో రైల్వే ప్రాజెక్టులు కూడా ఉన్నాయి.ముఖ్యమైన వాటిలో కొత్తపల్లి-మనోహరాబాద్ మినహా మిగిలిన పనులకు నిధులు,భూసేకరణ తదితర అవాంతరాలు ఆటంకాలుగా మారుతున్నాయి.