దేశంలోని ఇతర రాష్ర్టాలతో పోలిస్తే రాష్ట్రం సగటున ఏటా 17.2 శాతం వృద్ధిరేటులో పురోగమిస్తున్నది. సొంత ఆదాయ వనరులతోనే దీనిని సాధించడం విశేషం. ఆర్థిక వృద్ధిలో నాలుగేండ్లుగా దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ఆర్థికశాఖ వెల్లడించింది.
2014-15 నుంచి 2017-18 వరకు పరిశీలిస్తే.. రాష్ట్ర సొంత ఆదాయ వనరులతోనే తెలంగాణ ఈ ప్రగతిని సాధిస్తూ వస్తున్నది. కొత్తగా ఏర్పాటైన రాష్ట్రమైనప్పటికీ.. హర్యానా, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, పంజాబ్, గుజరాత్ లాంటి రాష్ర్టాలతో పోటీపడి మరీ వృద్ధిరేటులో అగ్రస్థానంలో కొనసాగుతున్నది.
కాగ్ వెబ్ సైట్లో పొందుపర్చిన గణాంకాల ప్రాకారం 2014-15లో రాష్ట్ర సొంత రెవెన్యూ 35 వేల 146 కోట్లు కాగా.. 2017-18లో 56 వేల 520 కోట్లకు చేరుకున్నది. దీని ప్రకారం ఏడాది సగటు గ్రోత్ రేట్ 17.2 శాతంగా ఉంది.