ప్రముఖ నటి సమంత శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామసమయంలో సమంత స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అర్చకులు వేదశీర్వచనం చేశారు. స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని సమంత తెలిపారు. తిరుమల స్వామి వారిని దర్శించుకోవడానికి మళ్ళీ మళ్ళీ తిరుమలకు వస్తానని సమంత అన్నారు. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందచేసి, సమంతను పట్టువస్త్రంతో సత్కరించారు. తిరుమల అంటే చాలా ఇష్టమైన ప్రదేశం అని సమంత అన్నారు.