నిన్న సిద్ధిపేట లో జరిగిన క్రైస్తవ ఆశీర్వాద సభలో తన్నీరు హరీష్రావు పాల్గొన్నారు.ఈ సభలో ఆయన మాట్లాడుతూ,
– మీ అభిమానాన్ని మరువ లేను…మీ ఋణం తీర్చుకుంటా…
– స్వచ్ఛందంగా వచ్చి టీఆర్ఎస్ పార్టీని దీవించినందుకు చాలా ధన్యవాదాలు.
– టీఆర్ఎస్ పార్టీని ఇంటి పార్టీగా చూస్తున్నారు.
– టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని కులాలను, మతాలను గౌరవించింది.
– కుల మతాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందిస్తున్నాం.
– సింగరేణిలో రంజాన్ కు, క్రిస్మస్ కు సెలవు ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్.
– హిందువులను, ముస్లిం లను రెండు కళ్ళ లాగా చూస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.
– సిద్దిపేట నియోజకవర్గంలో దాదాపు 30 చర్చిలకు 1 కోటి 30 లక్షల రూపాయల మంజూరు చేసాం.
– క్రైస్తవుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది.
– క్రైస్తవులు అడగకున్నా రాష్ట్రంలోనే మొట్టమొదటి పరలోక యాత్ర రథాన్ని సిద్దిపేటకు అందించాం.
– పేద క్రైస్తవులకు ప్రభుత్వ పథకాలలో నా సంపూర్ణ సహకారం ఉంటుంది.
– మీరు చూపించిన ఆత్మీయతను గుండెల్లో పెట్టి చూసుకుంటా.
– త్యాగాల పునాదుల మీద తెచ్చుకున్న తెలంగాణ ను ఎవరి చేతిలో పెట్టాలో మీరే ఆలోచించండి.
– కేసీఆర్ చేతిలో ఉంటేనే బంగారు తెలంగాణ గా రూపుదిద్దుకుంటుంది.
– గత 15 సంవత్సరాల నుండి క్రిస్మస్ రోజు సిద్దిపేట లోనే ఉంటున్నా.
రాబోయే రోజుల్లో నా శక్తి మేర మీకోసం పని చేస్తా అని అన్నారు.