హోమ్ మంత్రిగా మహమ్మద్ అలీ

తెలంగాణ రాష్ట్ర హోమ్ మంత్రి గా మహమ్మద్ అలీ ని నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.గురువారం మధ్యాహ్నం కేసీఆర్ తో పాటు మంత్రిగా మహమ్మద్ అలీ ఒక్కరే ప్రమాణం చేసారు.మహమ్మద్ అలీ నియామకాన్ని నోటిఫై చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి SK .జోషి ఉత్తర్వులు జారీ చేసారు.అయితే జీవో లో ఉపముఖ్యమంత్రి అని పేర్కొనలేదు.దీంతో ప్రస్తుత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రులు ఉండక పోవచ్చని తెలిసింది.మహమ్మద్ అలీ గత ప్రభుత్వంలో రెవెన్యూ శాఖా బాధ్యతలు నిర్వహించారు.తాజా బాధ్యతలతో తెలంగాణ రాష్ట్రంలో హోమ్ శాఖ బాధ్యతలను చేపట్టిన తొలి ముస్లిం నేతగా గుర్తింపు పొందారు.అలీ శాఖ మారిన నేపథ్యంలో గత ప్రభుత్వం లోని మంత్రుల శాఖల్లోనూ మార్పులు ఉంటాయని తెలుస్తుంది.

error: