కోవిడ్ బారినపడ్డ బాలీవుడ్ బాద్‌షా అమితాబ్ బచ్చన్ (77) త్వరలో కోలుకోవాలని మెగాస్టార్ చిరంజీవి ఆకాక్షించారు. అమితాబ్ జీ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని చిరు ట్విటర్‌లో పేర్కొన్నారు. కాగా, తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అమితాబ్ శనివారం సాయంత్రం ట్విట్టర్‌లో వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఆస్పత్రిలో చేరాను. ఆస్పత్రి అధికారులు నాతోపాటు మా కుటుంబ సభ్యులు, సిబ్బందికి కూడా పరీక్షలు చేయించారు. వారికి సంబం ధించిన ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది’ అని అందులో వివరించారు.