అడ్రస్ అడిగే సాకుతో బామ్మకు టోకరా వేద్దామనుకున్నాడు.. కట్‌చేస్తే..

సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే.. ఎలాంటి ప్రమాద సమయంలోనూ బయటపడేస్తుందని మరోసారి నిరూపిణ అయింది. ఓ పదేళ్ల చిన్నారి ధైర్యంగా ఓ దొంగ నుంచి తన బామ్మను ప్రమాదంలో పడకుండ కాపాడుకుంది. మహారాష్ట్రలోని పూణెలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తన అమ్మమ్మను కాపాడేందుకు పదేళ్ల బాలిక చైన్ స్నాచర్‌తో పోరాడింది. బాలిక ధైర్యం చూసిన చైన్ స్నాచర్.. ప్రాణాలు కాపాడుకుని అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరలవుతోంది. అమ్మాయి ధైర్యం, అవగాహనను ప్రజలు ప్రశంసిస్తున్నారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, పూణెలో ఫిబ్రవరి 25న మోడల్ కాలనీ ప్రాంతంలో తన మనవరాలు రుతవి ఘాగ్‌తో కలిసి లతా ఘాగ్ అనే 60 ఏళ్ల వృద్ధురాలు ఇంటికి వెళుతుంది. ఈ సమయంలో ఈ ఘటన జరిగింది.

దారి అడిగే సాకుతో వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లేందుకు ఓ దొంగ ప్రయత్నించాడు. ఇది చూసిన 10 ఏళ్ల రుత్వి ఆ దొంగను ధైర్యంగా ఎదుర్కొంది. ఆమె చేతిలోని బ్యాగ్‌తో, చైన్ స్నాచర్‌ ముఖంపై దాడి చేసింది. బాలిక

చేసిన ఈ దాడితో భయాందోళనకు గురైన దొంగ వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు.

error: