ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మద్దతు ధర

అమ్ముకోవాలని రైతులకు ఎమ్మెల్యే సతీష్ కుమార్ సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మాత్రమే రైతులు ధాన్యం సరిగా ఆరబెట్టుకొని తీసుకువచ్చి అమ్ముకోవాలన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామని, ప్రభుత్వం అందిస్తున్న క్వింటాలుకు 2,060 రూపాయల మద్దతు ధరను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా కొంతమంది రైతులు పత్తి పంటను మొదట వేసి పంట సరిగా రాకపోవడంతో దానిని తొలగించి పొద్దుతిరుగుడు పంటను వేశారని కానీ అది వ్యవసాయ అధికారులు నమోదు చేసుకోకపోవడంతో పొద్దు తిరుగుడు పంట గింజల కొనుగోలులో సమస్య తలెత్తిందన్నారు. ఈ సమస్యను మంత్రి హరీష్ రావు, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా వారు తెలిపిన వివరాల ప్రకారం మండలాలలో ఉన్న అగ్రికల్చర్ ఎక్సటెన్షన్ అధికారుల వద్ద ఏ రైతులయితే పత్తి పంటను తొలగించి పొద్దు తిరుగుడు పంట వేశారో వారి వివరాలు రాయించుకొని, హుస్నాబాద్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన పొద్దుతిరుగుడు గింజల కొనుగోలు కేంద్రానికి తీసుకొని వస్తే ప్రభుత్వం అందిస్తున్న 6,400 మద్దతు ధరకు అమ్ముకోవచ్చన్నారు. అదేవిధంగా వారం రోజుల్లో హుస్నాబాద్ మార్కెట్ యార్డ్ లో మక్కల కొనుగోలు కేంద్రాన్ని కూడా ప్రారంభిస్తామన్నారు. అంతకుముందు హుస్నాబాద్ మండలానికి చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్

error: