కాంగ్రెస్ దూకుడు

కర్ణాటకలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ఓట్ల కౌటింగ్ లో మొదటి రౌండ్ దాటేసరికే కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. దీంతో హస్తం పార్టీ గెలుపు దిశగా దూసుకుపోతోంది. కర్ణాటకలో మ్యాజిగ్ ఫిగర్ 113కాగా కాంగ్రెస మొదటిరౌండ్ దాటేసరికే 122 స్థానాల్లో గెలుపు దిశాగా దూసుకుపోతోంది. అంటే మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. దీంతో కర్ణాటకలో ఎనిమిది మంది మంత్రులు వెనుకబడ్డారు. హస్తం దూకుడును రీచ్ కాలేకపోతున్నారు. దీంతో కర్ణాటకలో కాంగ్రెస్ దే గెలుపు అనే సంకేతాలు వస్తున్న క్రమంలో హస్తం పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాల్లో తేలిపోతున్నారు. మొదటి రౌండ్ కే కాంగ్రెస్ 125 దాటేయగా బీజేపీ మాత్ంర కేవలం 80లోపే నిలిచిపోయింది.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి చిక్కమగళూరు నియోజకవర్గంలో వెనుకంజలో ఉండగా అలాగే బళ్లారి రూరల్ నియోజకవర్గంలో మంత్రి బి. శ్రీరాములు వెనుకంజలో ఉన్నారు. నార్గుండ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సీసీ పాటిల్ వెనుకంజలో ఉన్నారు.బీజేపీ పరిస్థితి ఇలా ఉంటే కాంగ్రెస్ మాత్రం దూసుకుపోతోంది. 110 అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థులు 86 అసెంబ్లీ స్థానాల్లో, 18 చోట్ల జేడీఎస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. చన్నపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి ఆధిక్యంలో ఉన్నారు.

error: