అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలని శివసేన డిమాండ్ చేసింది.ఇచ్చిన హామీని నిలుపుకోకపోతే బీజేపీ కి వచ్చే ఎన్నికల్లో పరాభవం తప్పదని హెచ్చరించింది.ఆలయం అంశాన్ని ఎన్నికల వాగ్దానంలా భావించడమంటే,హిందుత్వాన్ని పరిహసించడమే అని శివసేన పత్రిక సామ్నా సంపాదకీయంలో విమర్శించింది.ఇకనైనా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని హెచ్చరించింది.