ఆరు మూల స్తంభాలు
– బడ్జెట్ 2021లో భాగంగా ఆరు మూల స్తంభాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
-ఇందులో మొదటిది ఆరోగ్యం, సంరక్షణ
-రెండోది ఫిజికల్, ఫైనాన్షియల్ క్యాపిటల్ అండ్ ఇన్‌ఫ్రా
-మూడోది సమ్మిళిత వృద్ధి
– నాలుగోది హ్యూమన్ క్యాపిటల్.
– ఐదోది ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ (ఆర్ & డీ)
– ఆరోది కనిష్ఠ ప్రభుత్వం, గరిష్ఠ పాలన
-ఈ ఆరు మూల స్తంభాలపైనే బడ్జెట్‌ను రూపొందించినట్లు నిర్మల తెలిపారు.
బడ్జెట్ అంచనా
-2021-22 బడ్జెట్ అంచనా మొత్తం రూ. 34.83 లక్షల కోట్లు
-15వ ఆర్థిక సంఘం సిఫార్సులకు కేంద్రం ఆమోదం
-17 రాష్ర్టాల్లో రెవెన్యూ లోటు భర్తీకి రూ. 17,340 కోట్లు
ద్రవ్యలోటు అంచనా 9.5 శాతం
-ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు అంచనా 9.5 శాతం
-2021-2022లో ద్రవ్యలోటును 6.8 శాతానికి పరిమితం చేయాలని లక్ష్యం
-ద్రవ్యలోటును ప్రభుత్వ అప్పుల ద్వారా భర్తీకి ప్రయత్నాలు
-వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 12 లక్షల కోట్లు అప్పులు తేవాలని నిర్ణయం
-ఈ 2 నెలల్లో ఇంకా రూ. 80 వేల కోట్లు అప్పులు చేయాల్సి ఉంది
-2025-26 నాటికి ద్రవ్యలోటును 4.5 శాతం లోపు పరిమితం చేయాలని లక్ష్యం
ఐటీ రిటర్న్స్
-75 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సిన అవసరం లేదు
-పింఛను, వడ్డీ ఆదాయం ఆధారంగా ఐటీ మినహాయింపు
-పన్ను వివాదాల నివారణకు వివాద పరిష్కార కమిటీ
-రూ. 50 లక్షల లోపు ఆదాయం, రూ. 10 లక్షల లోపు వివాదాలు ఉన్నవారు నేరుగా కమిటీకి అప్పీల్ చేసే అవకాశం
తగ్గనున్న బంగారం ధరలు
-తగ్గనున్న బంగారం, వెండి ధరలు
-పెరగనున్న కార్ల విడిభాగాల ధరలు
-మొబైల్ రేట్లు పెరిగే అవకాశం
-నైలాన్ దుస్తుల ధరలు తగ్గే అవకాశం
-సోలార్ ఇన్వర్టర్లపై పన్ను పెంపు
-ఇంపోర్టెడ్ దుస్తులు మరింత ప్రియం
విద్యుత్ రంగం
-విద్యుత్ రంగానికి రూ. 3.05 లక్షల కోట్లు
-పీపీఏ పద్ధతి ద్వారా 2,200 కోట్లతో ఏడు కొత్త ప్రాజెక్టులు
-సౌర శక్తి రంగానికి మరో వెయ్యి కోట్లు
-జమ్మూకశ్మీర్‌లో గ్యాస్ పైప్‌లైన్ ఏర్పాటు
రైల్వే రంగం
-రైల్వేలకు రూ. 1.15 లక్షల కోట్లు
-మెట్రో లైట్, మెట్రో న్యూ పేరుతో ప్రాజెక్టులు
-బెంగళూరులో మెట్రో విస్తరణకు రూ. 14 వేల 700 కోట్లు
-చెన్నై మెట్రో విస్తరణకు రూ. 63 వేల కోట్లు
ఆరోగ్య రంగం
-ఆరోగ్య రంగంలో రూ. 64,180 కోట్లతో ప్రత్యేక నిధి
-నివారణ, చికిత్స, సంపూర్ణ ఆరోగ్య విధానంలో పథకం
-కొత్తగా 9 బీఎస్ఎల్ -3 స్థాయి ప్రయోగశాలలు
-15 అత్యవసర ఆరోగ్య కేంద్రాలు
పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం
-పలు సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం
-గెయిల్, ఐఓసీ, హెచ్‌పీసీఎల్ పైపులైన్లలో పెట్టుబడుల ఉపసంహరణ
-జాతీయ స్థాయిలో పెట్టుబడుల ఉపసంహరణ పర్యవేక్షణకు ప్రత్యేక డ్యాష్ బోర్డు
– రాష్ర్టాలు, స్వయం ప్రతిపత్తి వ్యవస్థల మూలధన వ్యయం కోసం రూ. 2 లక్షల కోట్లు
మరో ఏడాది పొడిగింపు
-ప్రధానమంత్రి ఆవాస్ యోజన మరో ఏడాది పొడిగింపు
-అందుబాటు ధరల గృహరుణాల రాయితీ పథకం మరో ఏడాది పొడిగింపు
-అందుబాటు ధరల్లో గృహాలు నిర్మించే సంస్థలకు మరో ఏడాది పాటు పన్ను విరామం
కోటి మందికి ఉజ్వల పథకం
– వంట గ్యాస్‌కు సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
– నగరాల్లో ఇంటింటికి వంట గ్యాస్ సరఫరా చేసే ఉజ్వల పథకం
– దేశంలో మరో కోటి మంది లబ్ధిదారులకు ఉజ్వల పథకం.
– కొత్తగా మరో 100 జిల్లాల్లోని నగరాలకు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్
-జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో గ్యాస్ పైప్‌లైన్ నిర్మాణం
-సామాజిక భద్రతా పథకాల్లోకి వీధి వ్యాపారులు
-గోవా డైమండ్ జూబ్లీ ఉత్సవాలకు రూ. 300 కోట్లు
-అంకురల సంస్థ ప్రోత్సాహానికి ప్రత్యేక చర్యలు
-డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహానికి రూ. 1500 కోట్లు
750 ఏకలవ్య పాఠశాలలు
-స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో మరో 100 సైనిక పాఠశాలలు ఏర్పాటు
-గిరిజన విద్యార్థుల కోసం కొత్తగా 750 ఏకలవ్య పాఠశాలలు
-హైదరాబాద్‌లో 40 వరకు ఉన్నత విద్యాసంస్థలు ఉన్నాయి
-దేశ వ్యాప్తంగా 9 నగరాల్లో ఉన్నత విద్యాసంస్థలు ఉన్నాయి
నీతి ఆయోగ్‌కు ఆదేశం
-పెట్టుబడుల ఉపసంహరణ తర్వాత జాబితా తయారు చేయాలని నీతి ఆయోగ్‌కు ఆదేశం
-వ్యూహాత్మక 4 రంగాలు మినహా అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ
చిన్న పరిశ్రమలు అవే..
-చిన్న పరిశ్రమల నిర్వచనంలో మార్పు
-రూ. 50 లక్షల నుంచి రూ. 2 కోట్ల పెట్టుబడి పరిమితి వరకు చిన్నసంస్థలుగా గుర్తింపు
– వ్యవసాయ రుణాల లక్ష్యం రూ. 16.5 లక్షల కోట్లు
-బ్యాంకుల మొండి బకాయిల కోసం ఆస్తుల పునర్ వ్యవస్థీకరణ సంస్థ ఏర్పాటు
ఎక్కడైనా రేషన్
-వలస కార్మికులకు దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే అవకాశం
-కుటుంబ సభ్యులు వేర్వేరు చోట్ల ఉంటే వాటా ప్రకారం రేషన్ తీసుకునే అవకాశం
స్టార్టప్‌లకు చేయూత
-స్టార్టప్‌లకు చేయూత కోసం ఏకసభ్య కంపెనీలకు మరింత ఊతం
-కంపెనీలు ఒక వ్యాపారం నుంచి మరో వ్యాపారానికి మారే సమయం 180 నుంచి 120 రోజులకు కుదింపు
బీమా చట్టానికి సవరణ
-1938 బీమా చట్టానికి సవరణ
– బీమా కంపెనీల్లో ఎఫ్‌డీఐల పరిమితి 49 నుంచి 74 శాతానికి పెంపు
రెండంకెల వృద్ధి తప్పనిసరి
-కొత్త ప్రాజెక్టుల కోసం ప్రస్తుత ప్రాజెక్టుల్లో పెట్టుబడుల ఉపసంహరణ తప్పనిసరి
-రూ. 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం చేరాలంటే రెండంకెల వృద్ధి తప్పనిసరి
27.1 లక్షల కోట్లతో ప్యాకేజీలు
-కరోనా సమయంలో రూ. 27.1 లక్షల కోట్లతో ప్యాకేజీలు ప్రకటించాం
-ప్యాకేజీలు ఆర్థిక వ్యవస్థను కాపాడి సంస్కరణలకు ఊతమిచ్చాయి
-13 రంగాల్లో పీఎల్ఐ ప్రోత్సాహకాల కోసం ఖర్చుకు నిర్ణయం
– రానున్న మూడేళ్లలో 7 టెక్స్‌టైల్స్ పార్కుల ఏర్పాటు
జాతీయ రహదారుల అభివృద్ధి
-5 ప్రత్యేక జాతీయ రహదారుల అభివృద్ధికి రూ. 5 వేల కోట్లు
-11 వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల కారిడార్ నిర్మాణం
– అసోం, కేరళ, బెంగాల్‌లో జాతీయ రహదారుల అభివృద్ధి
-బెంగాల్‌లో 675 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల అభివృద్ధి
ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు
-2022 జూన్ నాటికి తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు
-ఖరగ్‌పూర్ – విజయవాడ మధ్య ఈస్ట్ – కోస్ట్ సరకు రవాణా కారిడార్
స్వచ్ఛభారత్ అర్బన్
-ఘన వ్యర్థాల నిర్వహణ కోసం స్వచ్ఛభారత్ అర్బన్
-ఐదేళ్లలో స్వచ్ఛభారత్ అర్బన్ కోసం రూ. 1,41,670 కోట్లు
వాహనాల ఫిట్‌నెస్
– దేశంలోని వాహనాల ఫిట్‌నెస్ పరీక్షకు ప్రత్యేక విధానం
-వ్యక్తిగత వాహనాలకు 20 ఏండ్లు, వాణిజ్య వాహనాలకు 15 ఏండ్లు
– కాలపరిమితి ముగిసిన తర్వాత ఫిట్‌నెస్ పరీక్షకు వెళ్లాలని నిబంధన
-తుక్కు వాహనాల రద్దు, అధునాతన వాహనాల వినియోగం
-15 ఏండ్లు దాటిన వాణిజ్య వాహనాలను తుక్కు కింద మార్చే పథకం
ప్రధాని జల్‌జీవన్ మిషన్ అర్బన్
– పట్టణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి కోసం ప్రధాని జల్‌జీవన్ మిషన్ అర్బన్
-రక్షిత మంచినీటి పథకాల కోసం రూ. 87 వేల కోట్లు
-రూ. 87 వేల కోట్లతో 500 నగరాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలు
-ఘన వ్యర్థాల నిర్వహణ కోసం స్వచ్ఛభారత్ అర్బన్
-ప్రపంచ దేశాలకు భారత్ ఓ ఆశాకిరణంగా కనిపిస్తోంది
-ఆర్థిక వ్యవస్థ చరిత్రలో మూడుసార్లు మాత్రమే జీడీపీ మైనస్‌లో ఉంది
కరోనాపై యుద్ధం
– 100 దేశాలకు కరోనా టీకాను సరఫరా చేస్తున్నాం
-కొవిడ్ నివారణలో ప్రపంచానికి దిక్సూచిగా నిలిచాం
-భారత్‌లో రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి
-మరో రెండు కొత్త వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి
-ఎకానమీ పునరుజ్జీవానికి అవసరమైన చర్యలన్నీ ఈ బడ్జెట్‌లో ఉన్నాయి
-కరోనాపై యుద్ధం కొనసాగుతుంది
-ఆత్మ నిర్భర్ భారత్ ఆదర్శం కొత్తది కాదు
-ఈ దేశం మూలాల్లోనే ఆత్మనిర్భర్ భావం ఉంది
– ప్రపంచ యుద్ధాల తర్వాత ఆర్థిక, సామాజిక రంగాల్లో ప్రపంచం మారింది
– ఇప్పుడు కరోనా తర్వాత కూడా మనం మరో కొత్త ప్రపంచంలో ఉన్నాం
-లాక్‌డౌన్ వల్ల అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది
– కనీవినీ ఎరుగని పరిస్థితుల్లో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నాం
-కేంద్రం ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భర్ ప్యాకేజీలు లాక్‌డౌన్ కష్టాలను కొంత వరకూ తగ్గించాయి
-ఐదు ప్యాకేజీలు ఐదు బడ్జెట్‌లతో సమానం
– విద్యుత్, వైద్యారోగ్యం, బ్యాంకింగ్, అగ్నిమాపక రంగాల్లో తమ ప్రాణాలొడ్డి పని చేశారు
-లాక్‌డౌన్ పెట్టకపోయి ఉంటే భారత్ భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చేది
-మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
– పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ 2021-22
-మోదీ సర్కార్‌కు ఇది 9వ బడ్జెట్
– కేంద్ర బడ్జెట్‌కు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం
– బడ్జెట్‌కు ముందు లాభాల్లోకి దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు
– ఆరంభ ట్రేడ్‌లో సెన్సెక్స్ 407 పాయింట్లు, నిఫ్టీ 124 పాయింట్లు లాభపడ్డాయి.
– బీఎస్ఈలో ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాక్, టైటాన్, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి.
– మేడిన్ ఇండియా ట్యాబ్‌లో నిర్మల బడ్జెట్
– ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం
– దేశ చరిత్రలో తొలిసారిగా కేంద్ర బడ్జెట్ పేపర్‌లెస్‌గా మారింది.
– ఈ ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌ను ట్యాబ్‌లో పొందుపరిచారు.
– ఎర్రటి బ్యాగులో ఐప్యాడ్ ట్యాబ్లెట్‌తో మంత్రి నిర్మలా సీతారామన్ కనిపించారు.