తండ్రి రుణం తీర్చుకున్న బిడ్డ

ఆరా: ఈ రోజుల్లో స్త్రీ, పురుష బేధభావాలు సమసిపోయాయి.

ఏ పనినైనా స్త్రీ, పురుషులిద్దరూ సమానంగానే చేస్తున్నారు. తల్లిదండ్రుల బాధ్యతను కూడా మహిళలే వహిస్తున్నారు.

చివరికి తల్లిదండ్రుల చితికి నిప్పు పెట్టే కార్యాన్ని కూడా మహిళలే చేస్తున్నారు. ఇటువంటి ఘటన బీహార్‌లోని ఆరా పట్టణంలోని ఎంపీ బాగ్‌లో చోటుచేసుకుంది.

ఈ ప్రాంతానికి చెందిన ఉత్తమకుమార్ మృతి చెందారు అతనికి ఒకే కుమార్తె కుమారులు లేరు.

ఈ నేపధ్యంలో స్థానికులంతా ఉత్తమ కుమార్ మృతదేహాన్ని స్మశానవాటికకు తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా తండ్రి చితికి కుమార్తె నేహా కుమారి స్వయంగా నిప్పంటించారు.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తన తండ్రి చివరి కోరికను తీర్చానని, ఆయన కోరుకున్నట్లు ఆయన చితికి నిప్పంటించి కుమారునిగానూ తన బాధ్యతను నెరవేర్చానని తెలిపారు.

error: