తొక్కిసలాటలో ఇద్దరు మృతి

కరుణానిధి పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచిన రాజాజీ హాల్ వద్ద తొక్కిసలాట జరిగింది. దీంతో ఇద్దరు వ్యక్తులు మరణించగా, 30 మంది గాయపడ్డారు. కరుణను కడసారి చూసేందుకు రాజాజీ హాల్ వద్దకు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. పోలీసులు వీరిని అదుపు చేసే క్రమంలో తొక్కిసలాట జరిగింది. గాయపడిన వారిని రాజీవ్‌గాంధీ దవాఖానకు తరలించగా చికిత్సపొందుతూ ఇద్దరు మరణించారు. వీరిలో ఒక మహిళ ఉన్నారు.

error: