పద్మశాలి సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సతీష్ కుమార్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో 13 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న పద్మశాలి సంఘం భవన నిర్మాణానికి ఎమ్మెల్యే సతీష్ కుమార్ శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం 13 లక్షల రూపాయల వ్యయంతో పనులు ప్రారంభిస్తున్నామని ఇంకా అవసరమైన నిధులను తన నిధుల నుండి మాత్రమే తన తండ్రి అయిన ఎంపీ లక్ష్మీ కాంతారావు నిధుల నుండి కూడా సమకూరుస్తామని అన్నారు. అనంతరం హుస్నాబాద్ బస్ డిపో గ్రౌండ్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని నియోజకవర్గస్థాయి కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ లీగ్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఏడు మండలాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ 67 వ జన్మదినాన్ని పురస్కరించుకొని టిఆర్ఎస్వి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ లీగ్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి నైపుణ్యం కలిగిన యువ క్రికెట్ క్రీడాకారులను వెలికి తీసి, హుస్నాబాద్ ప్రాంతం నుండి ఒక అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారున్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రతి క్రికెట్ టీం కు 1200 రూపాయల ఎంట్రీ ఫీజు ఉంటుందని, ఫైనల్ లో గెలుపొందిన క్రికెట్ టీంకు 1,20000 రూపాయల ప్రథమ బహుమతి, రన్నరప్ టీంకు 60,000 రూపాయల ద్వితీయ బహుమతి, మ్యా ఆఫ్ ది మ్యాచ్ కు 10,000 రూపాయల బహుమతులను అందించడం జరుగుతుందన్నారు. క్రీడాకారులు టోర్నమెంట్ లో సరైన జాగ్రత్తలు మెలకువలు పాటిస్తూ ఆడాలని, ఇట్టి టోర్నమెంట్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ రాజారెడ్డి, మున్సిపల్ చైర్మన్ రజిత, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

error: