ఉత్తరప్రదేశ్… మీరట్‌లో జరిగిన ఓ పెళ్లి విందులో ఓ యువకుడు రోటీలు (చపాతీలు) తయారుచేస్తూ… వాటిపై ఉమ్మి వేస్తున్నాడు. ప్రతీ చపాతీపైనా ఉమ్మి వేశాడు. చపాతీలను చాక చక్యంగా తిప్పుతూ ఒకదానిమీద మరొకటి పేర్చి ప్రతీ చపాతీపై ఉమ్మి ఊసి పేరుస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో చూసినవారంతా అతడిని తిట్టిపోస్తున్నారు. ఇక ఆ పెళ్లికి హాజరై చపాతీలు తిన్నవారి పరిస్థితి ఏంటాని వాపోతున్నారు.
ఛీచీ ఇటువంటివారిని క్యాటరింగుల్లో పెట్టుకోకూడదని తిట్టిపోస్తున్నారు. ఇలాంటి వాళ్లని అస్సలు వదలకూడదని డిమాండ్ చేస్తున్నారు. అదే జరిగింది. ఆ వీడియో వైరల్ అయ్యీ అయ్యీ పోలీసుల దాకా వెళ్లింది. పై అధికారుల నుంచి కింది పోలీసులకు కాల్స్ వచ్చాయి. విషయం తేల్చాలని ఆదేశాలు కూడా వచ్చాయి. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సదరు ప్రబుద్ధిడి కోసం దర్యాప్తు ప్రారంభించారు.