దగ్గినా, తుమ్మినా… అది కరోనాయే అనుకొని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లిపోతు ప్రమాదాన్ని తెచ్చుకుంటున్నారు అందరూ.. దగ్గర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి కూడా వెళ్లొచ్చు. ఎక్కడైనా ఫ్రీ ట్రీట్‌మెంటే. అందరూ ప్రభుత్వ ఆస్పత్రులకే వెళ్తే… అక్కడ బిజీ ఎక్కువై… గంటల తరబడి వెయిట్ చెయ్యాల్సి ఉంటుంది. అందువల్ల ఒకవేళ మీకు కరోనా లేకపోయినా… అక్కడకు కరోనాతో వచ్చే ఇతరుల వల్ల మీకు కరోనా సోకే ప్రమాదం ఉంటుంది. అయితే వయసు మళ్లినవారికి, గుండె జబ్బులు, ఉబ్బసం, బీపీ షుగర్లు వంటి ఇతరాత్ర జబ్బులు ఉన్నవారికి కరోనా వైరస్ సోకితే కోలుకోవడం మరింత కష్టం అవుతుంది అని వైద్యులు చెబుతున్న విషయం తెలిసిందే.
అయితే తాజాగా కరోనా వైరస్ బారినపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల్లో గురకపెట్టి పడుకునే వాళ్లు ఉన్నట్లయితే వారి ప్రాణాలకు మూడు రెట్లు ప్రమాదం ఎక్కువని పరిశోధకులు తేల్చి చెప్పారు. కరోనా వైరస్, నిద్రకు ఉన్న సంబంధంపై ఇప్పటివరకు 18 అధ్యయనాలు జరిపిన వార్‌విక్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు పరిశీలించి ఈ విషయాన్ని తేల్చారు.
స్థూలకాయం, బీపీ, షుగర్ ఉన్నలట్లయితే ఆ మూడే వారికి ప్రమాదం. వారిలో గురుకపెట్టే వారు ఉన్నట్లయితే వారికి అది అదనపు ప్రమాద కారకం కాదు. వాస్తవానికి ఈ మూడు అనారోగ్య సమస్యలు ఉన్నవారందరికి గురకపెట్టే అలవాటు వస్తుంది’ అని పరిశోధకులు వెల్లడించారు. కాగా, ఇంగ్లండ్‌లో 15 లక్షల మంది, అమెరికాలో 2.20 కోట్ల మంది గురక సమస్యతో బాధ పడుతున్నారని వివరన ఇచ్చారు
గురక పెడుతూ నిద్రపోయేవారిలో కండరాలు విశ్రాంతి తీసుకున్నప్పుడు కొన్ని క్షణాలపాటు తాత్కాలికంగా శ్వాసనాళంలోకి గాలి సరిగ్గా పోదని, ఫలితంగా వారికి ప్రాణాపాయం ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉందని అంటున్నారు. గురక పెట్టేవాళ్లకు కరోనా సోకడం ఒక ప్రమాద కారకమే కానీ, అదనపు ప్రమాద కారకం కాదని పరిశోధకులు వివరించారు.