హైదరాబాద్: జాతీయ రైతు సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రగతిభవన్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి 26 రాష్ట్రాల రైతు సంఘాల నేతలు హాజరయ్యారు. వ్యవసాయరంగం, రైతులు ఏదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం, సాగునీటి రంగాల అభివృద్ధిపై చర్చిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో నెలకొల్పిన అంశాలపై జాతీయ రైతు సంఘాల నేతలకు సీఎం కేసీఆర్ వివరించనున్నారు. రైతు నేతలతో సీఎం కేసీఆర్ శనివారం సమావేశమైన విషయం తెలిసిందే.
‘చైతన్యంతో స్వాతంత్య్రాన్ని సంపాదించుకున్న ఏ దేశమైనా, ఏ సమాజమైనా ఆ పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతుంది. భవిష్యత్ తరాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తమ దేశాల చట్టాలను, పాలనావ్యవస్థలను రూపొందించుకొంటుంది. ప్రజలకు దీర్ఘకాలిక అవసరాల ప్రాతిపదికన సర్వానుమతితో పాలనను ప్రారంభిస్తారు. తొలిదశలో పరిపాలన సంపూర్ణంగా ఉండకపోవచ్చు. బాలారిష్టాలను దాటుకుంటూ అనుభవాలను, కార్యాచరణను క్రోడీకరించుకోవడం ద్వారా రెండు మూడు దశాబ్దాల్లో పాలన 80% వరకు విజయవంతంగా గాడిలో పడుతుంది. తద్వారా ఆ దేశ ప్రజల జీవితాలు గుణాత్మకంగా అభివృద్ధిని సాధిస్తాయి. మిగిలిన కొద్దిశాతం పాలన కూడా మరికొద్దికాలంలో చకబడి, పరిపూర్ణత సాధించుకుంటుంది. ప్రపంచంలో సైన్సు, సాంకేతిక అభివృద్ధి పెరుగుతున్న కొద్దీ ఆయా సమాజాల్లో నూతన ఆవిషరణలు చోటుచేసుకుంటాయి. అలా సాంకేతికత పెరుగుతున్నకొద్దీ.. పాలనలో పరిపూర్ణత వస్తుంది. మానవ జీవితం ఉన్నంతకాలం ఈ పరిణామ క్రమం నిరంతర ప్రక్రియగా కొనసాగుతూనే ఉంటుంది’ అని శనివారం నాటి భేటీ సందర్భంగా రైతు నేతలకు సీఎం కేసీఆర్ వివరించారు.
Tags formers INDIA kcr telangana