రైల్వే స్టేషన్ లో తల్లి నుండి శిశువు కిడ్నాప్

రైల్వే స్టేషన్‌లో నిద్రిస్తున్న ఏడు నెలల శిశువును తల్లి నుండి కిడ్నాప్ చేస్తున్న ఓ వ్యక్తి సీసీ కెమెరాకు చిక్కాడు. మధుర రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్‌పై ఈ సంఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని మథుర రైల్వే స్టేషన్‌లో జరిగింది ఈ కిడ్నాప్‌ ఉదాంతం.. నేరానికి సంబంధించిన వీడియోను ఉత్తరప్రదేశ్ పోలీసులు సోషల్ మీడియాలో షేర్‌ చేశారు.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో..సీసీటీవీ ఫుటేజీలో నిందితుడు రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై నిద్రిస్తున్న వారిపై నడుచుకుంటు వెళ్లడం చూడవచ్చు. అక్కడంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఆ వ్యక్తి తన చేతుల్లో బిడ్డతో ప్లాట్‌ఫారమ్‌లో ఉన్న రైలు వైపు పరుగెత్తాడు.

పోలీసు బృందాలు ఇప్పుడు నిందితుడి కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. నిందితుడి ఫోటో ఆన్‌లైన్‌లో షేర్‌ చేశారు. నిందితులను పట్టుకోవడానికి హత్రాస్, అలీఘర్‌లలో విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు పోలీసులు. అనుమానితుడి గురించిన వివరాలను సేకరించేందుకు మధుర రైల్వే స్టేషన్‌లోని అన్ని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు.

error: