వింత దూడ జననం…పూజలు చేస్తున్న జనం

భూమిపై నిత్యం ఎక్కడో ఒక చోట ఎదో ఒక వింత జరుగుతూనే ఉంటుంది.
2020 నుంచి ఎప్పుడు చూడని వింత వింత సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.
దీంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.
కలియుగం అంతం కాబోతుందంటూ భయపడుతున్నారు.రాబోయే రోజులు మరింత గడ్డుగా మారబోతున్నాయని, దానికి ఈ సంఘటనలే నిదర్శనమని చెప్పుకుంటున్నారు.
అయితే, ఇలాంటి వింత సంఘటన ఒకటి తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది.
తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం రామపర్తి గ్రామానికి చెందిన ఓ రైతు ఇంట్లో ఆరు కాళ్లతో వింత దూడ జన్మించింది.ప్రతి రెండు కాళ్ళ మధ్యలో మరోక కాలు ఉండటంతో మొత్తం ఆరు కాళ్లతో జన్మించింది.వింత దూడ జన్మించిందని తెలుసుకున్న ప్రజలు ఆ దూడను చూసేందుకు ప్రజలుపెద్ద సంఖ్యలో రైతు ఇంటికి చేరుకుంటున్నారు.కొందరైతే ఆ దూడకు పూజలు చేస్తున్నారు.

error: