ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొంది,వాటిలో చేరని విద్యార్థులు చెల్లించిన ప్రవేశ,ఇతర రుసుములను తిరిగి చెల్లించాల్సిందే అని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆదేశించింది.ఒకవేళ ఏ కాలేజీ ఐనా చెల్లించకపోతే వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి సత్యపాల్ సింగ్ తెలిపారు.వాటితో పాటు అన్ని సర్టిఫికెట్స్ కూడా తిరిగి ఇవ్వాలని స్పష్టం చేశారు.