అంతుచిక్క‌ని వైర‌స్ వ్యాప్

గ్రేట‌ర్ మ‌హాన‌గ‌రాన్ని మ‌హ‌మ్మారి క‌రోనా వ‌ణికిస్తోంది. తెలంగాణ‌లో న‌మోద‌వుతున్న పాజిటివ్ కేసుల్లో అత్య‌ధికం హైద‌రాబాద్‌లో న‌మోదుకావ‌డం న‌గ‌ర‌వాసుల‌ను హ‌డ‌లెత్తిస్తోంది. రోజురోజుకూ క‌రోనా చిత్ర విచిత్ర రీతుల్లో బ‌య‌ట‌ప‌డుతోంది. దగ్గు, తుమ్ములు, జ్వరం వంటి ల‌క్ష‌ణాల‌తో బయటపడే ఈ వైరస్‌.. ఇటీవల ఇలాంటి లక్షణాలు ఏవీ లేనివారికి కూడా సోకుతున్నట్లు పరీక్షల్లో తేలింది. దీంతో ఎట్నుంచి కోవిడ్ భూతం విరుచుకుప‌డుతుందోన‌ని గ్రేట‌ర్ వాసులు భ‌యాందోళ‌న‌తో బిక్కుబిక్కుమంటున్నారు.
న‌గ‌రానికి చెందిన ఓ వ్య‌క్తి గ‌త కొంత‌కాలంగా పక్షవాతంతో మంచానికే పరిమిత‌మ‌య్యాడు. దీంతో అత‌డు రెండు నెలలుగా కాలు కూడా బయటపెట్ట‌లేదు. అయిన‌ప్ప‌టికీ అత‌డికి క‌రోనా వైర‌స్ సోకిన‌ట్లు తేలింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు వారి కుటుంబసభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించారు. అయితే, ఇంట్లోని వారంద‌రికీ వైర‌స్ నెగేటివ్‌గా రావ‌టంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు. అదే సమయంలో బాధితుడికి వైరస్‌ ఎలా సంక్రమించిందనేది మాత్రం ఎవ‌రికీ అంతుచిక్క‌టం లేదు. ఇక ఇటువంటిదే మ‌రో కేసు..
న‌గ‌రంలోని యాకుత్‌పురాకి  చెందిన 70 ఏళ్ల వృద్ధుడు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఆస్ప‌త్రికి వెళ్లాడు. వైద్యులు అత‌డికి అన్ని ప‌రీక్ష‌లు నిర్వ‌హించి కోవిడ్ ల‌క్ష‌ణాలున్న‌ట్లు గుర్తించారు. కానీ, ఆ వృద్ధుడికి సంబంధించి ఆయ‌న‌ కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ఇటీవల విదేశాల నుంచి రాకపోకలు సాగించలేదు. దాదాపు నెల రోజులుగా ఇంటికే పరిమిత‌మ‌య్యాడు. అయిన‌ప్ప‌టికీ ఆ వృద్ధుడికి కరోనా ఎలా సంక్రమించిందో ఎవ‌రీకి అంతుచిక్క‌టం లేదు. క‌రోనా వైర‌స్ వ్యాప్తిని నివారించేందుకు ప్ర‌భుత్వం ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికీ ఇటువంటి అంతుచిక్క‌ని కేసులు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి.
error: