భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 9,53,683 పరీక్షలు నిర్వహించగా.. 83,347 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 56,46,011కు చేరింది. తాజాగా 1085 మంది మృతి చెందడంతో మరణాల సంఖ్య 90 వేలు దాటింది. మరోవైపు కొవిడ్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. నిన్న ఒక్క రోజే 89,746 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 45,87,613కి చేరింది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 9,68,377గా ఉంది. ఇక రికవరీ రేటు 81.25%కి పెరగ్గా.. మరణాల రేటు 1.59%గా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ నిర్వహించిన టెస్టుల సంఖ్య 6,62,79,462కి చేరింది.