ఈ కరోనా చాలా స్పీడ్ , జాగ్రత్తగా లేకుంటే ఇక అంతే …

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇటీవల వెలుగుచూసిన ఒక్కో రకం కరోనా వైరస్‌లో సగటున 11 ఉత్పరివర్తనాలను కనుగొన్నట్టు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్సీ) పరిశోధకులు తెలిపారు. ఇది జాతీయ సగటు, ప్రపంచ సగటు కంటే ఎంతో ఎక్కువన్నారు. ఈ అధ్యయనానికి ఐఐఎస్సీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్‌ ఉత్పల్‌ టాటు నేతృత్వం వహించారు. కరోనా బారిన పడిన వారి నుంచి వైరస్‌ నమూనాలను సేకరించి ఈ అధ్యయనం చేపట్టారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం వైరస్‌ అత్యంత వేగంగా ఉత్పరివర్తనం చెందుతున్నదని ఉత్పల్‌ తెలిపారు. బెంగళూరుకు చెందిన వ్యక్తుల నుంచి సేకరించిన మూడు నమూనాల్లోని వైరస్‌ జన్యుక్రమాల్లో మొత్తం 27 ఉత్పరివర్తనాలను గుర్తించామని వెల్లడించారు. ఒక్కో రకం కరోనా వైరస్‌ నమూనాలో సగటున 11 ఉత్పరివర్తనాలు ఉన్నట్టు తెలిపారు. ఇది జాతీయ సగటు (8.4), ప్రపంచ సగటు (7.3) కంటే ఎంతో ఎక్కువన్నారు. బెంగళూరులో గుర్తించిన వైరస్‌ ఉత్పరివర్తనాలు, బంగ్లాదేశ్‌లో గుర్తించిన ఉత్పరివర్తనాలతో దగ్గరి పోలికను కలిగి ఉన్నట్టు వివరించారు. రోగనిరోధక శక్తిని క్షీణింపజేసే వైరస్‌లోని 13 విభిన్న ప్రొటీన్లను కూడా కనుగొన్నట్టు తెలిపారు. వైరస్‌ జన్యుక్రమం విశ్లేషణలో భాగంగా ఎన్‌జీఎస్‌ సాంకేతికతను వాడినట్టు తెలిపారు.

error: