ముంబైలో భారీ అగ్నిప్రమాదం

మహారాష్ట్ర చెంబూర్‌లోని మహుల్ వద్ద ఉన్న భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) శుద్ధి కర్మాగారం(రిఫైనరీ)లో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్లాంట్‌లో జరిగిన పేలుళ్ల కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 43 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఎనిమిది మందిని దవాఖానకు తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నది. ప్లాంట్ నుంచి భారీఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో అగ్నిమాపక సిబ్బంది సులువుగా దగ్గరకు వెళ్లలేకపోతున్నారని, దూరం నుంచే మంటలు ఆర్పుతున్నారని అగ్నిమాపకశాఖ ముఖ్య అధికారి పీఎస్ రహంగ్‌దాలె తెలిపారు. బీపీసీఎల్ శుద్ధికర్మాగారం వద్ద ఉన్న హైడ్రోక్రాకర్ ప్లాంట్ కంప్రెషర్ షెడ్‌లో ఈ ప్రమాదం జరిగింది.

error: