ఆస్పత్రి నుంచి డిశ్చార్జి ఐన తలైవా

బీపీలో హెచ్చుతగ్గుల కారణంగా హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ రజనీకాంత్‌ కాసేపటి క్రితం ఆస్పత్రినుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే, రజనీ త్వరగా కోలుకునేందుకు వైద్యులు కొన్ని సూచనలు చేశారు.
వారం రోజుల పాటు రజనీ పూర్తి విశ్రాంతి తీసుకోవాలని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో కొవిడ్‌ సోకే అవకాశం ఉన్న ఏ కార్యక్రమంలోనూ పాల్గొన వద్దని సూచించారు. అదే సమయంలో ఒత్తిడిని తగ్గించుకునేందుకు చిన్న చిన్న వ్యాయామాలు చేయాలని తెలిపారు. గతంలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్న దృష్ట్యా మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీంతో ఆయన చెన్నై బయలుదేరి వెళ్తున్నారు.

error: