ఆధార్‌ కార్డున్న వారికి రూ. 4.78 లక్షలు ఇవ్వనున్న కేంద్ర ప్రభుత్వం,ఇది నిజమేనా ?

సోషల్ మీడియా ద్వారా సమాచార మార్పిడి చాలా వేగంగా జరుగుతోంది. ప్రభుత్వాలు సైతం తమ పాలసీలను, పథకాలను సైతం సోషల్‌ మీడియా ద్వారానే ప్రచారం చేసే రోజులు వచ్చాయి. అయితే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోన్న సమాచారం అంతా నిజమేనా అంటే కచ్చితంగా అవును అని సమాధానం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే సమాచారం పేరుతో నకిలీ సమాచారం వైరల్‌ అవుతోన్న రోజులివి.

ముఖ్యంగా ప్రభుత్వ పథకాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ఫేక్‌ పోస్ట్‌లు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఇలాంటి ఓ వార్తే నెటిజన్లను కన్ఫ్యూజన్‌కు గురి చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఆధార్‌ కార్డ్‌ కలిగి ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం రూ. 4,78,000 రుణం ఇస్తోంది అంటూ ఓ మెసేజ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. రుణాన్ని పొందాలంటే ఈ లింక్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలంటూ సదరు పోస్ట్‌లో పేర్కొన్నారు.

అయితే నెట్టింట వైరల్‌ అవుతోన్న ఈ వార్తలో ఎంతమాత్రం నిజం లేదని ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో అధికారికంగా ప్రకటించింది. పీఐబీ అధికారిక ట్విట్టర్‌ హాండిల్‌లో ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈ వార్త పూర్తిగా ఫేక్‌ అని, ఇలాంటి మెసేజ్‌లను ఎవరికీ ఫార్వర్డ్‌ చేయకూడదని తెలిపింది. అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లో మీ వ్యక్తిగత/ఆర్థిక పరమైన వివరాలను ఎవరితో షేర్‌ చేసుకోకూడదంటూ పీఐబీ ట్వీట్‌లో పేర్కొంది.

error: