రిటైర్మెంట్ ప్రకటించడం బాధాకరమే అయినా.. నేను క్రికెట్ కోసం అన్నీ ఇచ్చానన్న సంతృప్తి నాకు ఉంది. నేను ఎప్పుడూ ఊహించని రికార్డులను సాధించాను. ఇంగ్లండ్‌లో గ్రేట్ ప్లేయర్స్‌తో ఇంతకాలం ఆడాను. అయితే రిటైర్మెంట్కు ఇదే సరైన సమయం అని భావించాను అని కుక్ తన ప్రకటనలో చెప్పాడు.
ఇండియాతో వచ్చే శుక్రవారం మొదలయ్యే చివరి టెస్టే తన కెరీర్లో చివరి మ్యాచ్ అని కుక్ ప్రకటించాడు. 33 ఏళ్ల కుక్ టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన వాళ్లలో ఆరో స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు ఇంగ్లండ్ తరఫున 160 టెస్టులు ఆడిన కుక్.. 12,254 పరుగులు చేశాడు. అతని సగటు 44.88. ఇంగ్లండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ అతనే.
ఒకదశలో సచిన్ రికార్డులు కుక్ బద్ధలు కొడతాడని అందరూ భావించినా.. కొంతకాలంగా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నాడు. ఈ ఏడాది టెస్టుల్లో అతని సగటు కేవలం 18.62 మాత్రమే.
TS24 News