సిద్దిపేట : ప్రజలు కాలం కోసమో., కరెంటు కోసమో.. ఎదురు చూపులు వద్దు. కాల్వల నీళ్లతో.. మూడు పంటలు తీయాలని రాష్ట్ర రైతులను కోరారు. సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలంలోని అప్పలాయ చెరువు కుంట మత్తడి దూకడం, ముండ్రాయి గ్రామంలోని యజ్ఞం కుంట నిండటంతో ఆదివారం సాయంత్రం గోదావరి జలాలతో నిండిన చెరువు, కుంటల్లో గంగమ్మ తల్లికి ఫుష్పాభిషేకం చేసి, జల హారతి పట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.
ప్రతి రైతు లక్షాధికారి కావాలని, కాలం కోసమో., కరెంటు కోసమో.. ఎదురు చూపులు వద్దు. కాల్వల నీళ్లతో.. మూడు పంటలు తీయాలి.
భూమిని నమ్ముకుని బతికితే.. ఆరోగ్యంగా బతకొచ్చు.
22 ఏళ్ల తర్వాత అప్పలాయ చెరువు మత్తడి దూకి మీ ఊరికి నిండు దనం వచ్చింది..