న్యూఢిల్లీ : ప్రయాణీకుడు తీవ్ర అస్వస్ధతకు లోనవడంతో షార్జా-లక్నో ఇండిగో విమానం పాకిస్తాన్లోని కరాచీలో మంగళవారం అత్యవసరంగా ల్యాండ్ అయింది. కరాచీకి చేరుకున్న వెంటనే ప్రయాణీకుడు మరణించారని విమానాశ్రయ వైద్య బృందం నిర్ధారించిందని ఇండిగో ఓ ప్రకటనలో పేర్కొంది.
షార్జా నుంచి లక్నో బయలుదేరిన ఇండిగో 6ఈ 1412 విమానం మెడికల్ ఎమర్జెన్సీ తలెత్తడంతో కరాచీకి మళ్లించబడిందని, కరాచీలో వైద్య బృందం పరీక్షించేలోగానే దురదృష్టవశాత్తూ ప్రయాణీకుడు మరణించారని ప్రకటన తెలిపింది. ప్రయాణీకుడి కుటుంబ సభ్యులకు ఇండిగో ఎయిర్లైన్స్ ప్రగాఢ సంతాపం తెలియచేసింది. కాగా ఇండియన్ ఎయిర్ అంబులెన్స్ సైతం ఇటీవల ఇంధనం నింపుకునేందుకు ఇస్లామాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది.
TS24 News