హుస్నాబాద్ లో టి ఆర్ ఎస్ అభ్యర్థి సతీష్ కుమార్ మద్దతు గా క్రైస్తవుల ఆశీర్వాద సభలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు .ఆ సభలో ఆయన మాట్లాడుతూ…
– నిండు మనసుతో తెరాస ప్రభుత్వాన్ని, సతీష్ కుమార్ ను ఆశీర్వదించడం సంతోషం.
– మీరిచ్చిన బలంతో, యేసు ప్రభు దీవెనతో మరింత కష్టపడతాం.
– క్రిస్మస్ ను ఏ ప్రభుత్వం రాష్ట్ర పండుగ గా గుర్తించలేదు. కాని సీఎం కేసీఆర్ క్రైస్తవ పండుగ క్రిస్మస్ ను రాష్ట్ర పండుగగా గుర్తించారు.
– పండుగ నాడు ధరించేందుకు దుస్తులు పంపిణీ చేశారు.
– క్రిస్మస్ పండుగకు రెండు రోజుల సెలవు ప్రకటించారు.
– కళ్యాణ లక్ష్మి, షాధీ ముబారక్ పథకంతో ఆడపిల్లల పెళ్లికి సాయం చేసిన ప్రభుత్వం తెరాస ప్రభుత్వం.
– క్రైస్తవ సమస్యలను మ్యానిఫెస్టో లో చేర్చేందుకు కృషి చేస్తా.
– చర్చిల నిర్మాణ అనుమతులను సరళతరం చేశా
– హుస్నాబాద్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేశాం.
– డిసెంబరు మాసంలో మరో మారు తెరాస అధికారంలోకి రానుంది.
– తెరాస అధికారం లోకి వచ్చాక చేసే తొలి పండుగ క్రిస్మస్.
– పేద పిల్లలకు సన్న బియ్యం, ఉచిత విద్య అందిస్తోన్న ప్రభుత్వం తెరాస ప్రభుత్వం.
– దేశానికే ఆదర్శంగా తెలంగాణ లో పాలన సాగుతోంది.
– హుస్నాబాద్ అభివృద్ధికి కృషి చేస్తాం.
– అన్ని విధాలుగా అండగా ఉంటాం అన్నారు.