అజ్ఞానంతో ఈ బలి దానాలు ఎందుకు ?

గురుడు శుక్రుడు అంటూ అన్ని గ్రహాల వరకూ వెళ్లేంత ఎదిగిన మనిషికి బాబాలు గురూజీలు అంటూ వాళ్ళను గుడ్డిగా నమ్మే పైత్యం మాత్రం తగ్గటం లేదు ఎందుకో..? కుటుంబం కుటుంబం అంతా విద్యావంతులుగా , విజ్ఞానవంతులులా కనిపిస్తారు కానీ.., అజ్ఞానంతో బలిదానాలు చేసుకుంటారు… ఏంటీ వైపరీత్యం ?

మూఢనమ్మకాలను రూపుమాపి, జ్ఞానజ్యోతి వెలిగించేందుకు చర్యలు తీసుకోవాల్సింది పోయి ప్రభుత్వాలు నడిపే ముఖ్యమంత్రులే పొర్లుదండాలు పెడుతూ బాబాలను మీరే దిక్కు అని కొలుస్తుంటే సామాన్యులు ఏం చేస్తారు.. “యథా రాజా తథా ప్రజా” నే కదా ?
మరుజన్మ కోసమని బలిదానం చేసుకోవాలని నిర్ణయించుకున్న ఓ మనిషీ.. ఈ జన్మలో గొప్పగా ఏం చేసావని మరుజన్మ కావాలి నీకు ?

-మదనపల్లి జంట హత్యల ఘటన నుండి ప్రేరణ

error: